Watch: Actress Meena And Sanghavi Dance Video Goes Viral - Sakshi
Sakshi News home page

Meena: భర్త చనిపోయాక తొలిసారి అలా.. వైరలవుతున్న వీడియో

Feb 16 2023 11:25 AM | Updated on Feb 16 2023 11:55 AM

Meena Dance With Sanghavi, Video Goes Viral - Sakshi

ఎప్పుడూ బిజీగా ఉంటూ ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది మీనా. ఈ తరుణంలో సోషల్‌ మీడియాలో ఫోటోలు,

బాలనటిగా తెరంగేట్రం చేసిన మీనా ఆ తర్వాత స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అగ్రహీరోలందరితోనూ నటించి దక్షిణాది ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నటిగా మంచి ఫామ్‌లో సమయంలో 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను పెళ్లాడింది. వీరి ప్రేమకు గుర్తుగా నైనికా అనే పాప జన్మించింది. ఓపక్క కుటుంబాన్ని చూసుకుంటూనే సినిమాలు చేస్తున్న మీనా జీవితంలో గతేడాది పెను విషాదం చోటుచేసుకుంది.

గతేడాది జూన్‌ నెలలో ఆమె భర్త కన్నుమూశారు. ఎప్పుడూ బిజీగా ఉంటూ ఆ బాధ నుంచి కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది మీనా. సినిమాలకు కూడా సైన్‌ చేసి షూటింగ్స్‌లో పాల్గొంటోంది. అంతేకాకుండా సోషల్‌ మీడియాలో ఫోటోలు, రీల్స్‌ షేర్‌ చేస్తూ తిరిగి నార్మల్‌ అవడానికి ట్రై చేస్తోంది. అయితే భర్త చనిపోయాక మొదటిసారి డ్యాన్స్‌ వీడియోను షేర్‌ చేసింది. సీనియర్‌ హీరోయిన్‌ సంఘవితో కలిసి ఓ పాటకు స్టెప్పులేసింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

చదవండి: నీ ప్రేమను ఎవరూ భర్తీ చేయలేరు: విష్ణుప్రియ
రెండుసార్లు బ్రేకప్‌.. అది బ్లాక్‌డే అంటున్న బ్యూటీ

Advertisement
 
Advertisement
Advertisement