Makers Banned Mobile Phones In Vijay Varisu Movie Shooting - Sakshi
Sakshi News home page

Vijay: వారీసు మూవీ టీంకు షాక్‌.. నిర్మాత దిల్‌ రాజు స్ట్రిక్ట్‌ వార్నింగ్‌!

Aug 18 2022 9:01 AM | Updated on Aug 18 2022 11:10 AM

Makers Banned Mobile Phones In Vijay Varisu Movie Shooting - Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రం వారీసు(తెలుగులో వారసుడు). నటి రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో శరత్‌కుమార్, ప్రకాశ్‌రాజ్, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్‌ చెన్నై, హైదరాబాద్, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఇక షూటింగ్‌ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

చదవండి: అందాల ఆరబోతలో తప్పేం లేదు: హీరోయిన్‌ 

ఇలాంటి పరిస్థితుల్లో చిత్రంలోని పలు కీలక సన్నివేశాలు లీక్‌ అయి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ చిత్ర యూనిట్‌కు షాక్‌ ఇచ్చాయి. దీంతో చిత్ర నిర్మాత యూనిట్‌ సభ్యులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. ఇకపై ఎవరూ సెట్‌లోకి సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని హుకుం కూడా జారీ చేశారట. అదే విధంగా చిత్రం విడుదల వరకు ఎలాంటి ఫొటో గాని, వీడియో గాని ఇకపై అనధికారికంగా బయటకు రావడానికి వీల్లేదని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ చిత్ర విజయం నటుడు విజయ్‌కి చాలా అవసరం. ఆయన నటించిన గత చిత్రం బీస్ట్‌ నిరాశపరిచింది. దీంతో వారీసు చిత్రంపై విజయ్‌ అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement