డబుల్ బొనాంజా?

మహేశ్‌బాబు ఇప్పటివరకూ ఒకే పాత్రలో రెండు షేడ్స్‌లో కనిపించిన సినిమాలు ఉన్నాయి. అయితే రెండు పాత్రలు చేయలేదు. తన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’లో డబుల్ యాక్షన్ చేయనున్నారు అనేది ఫిల్మ్‌నగర్ టాక్. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా నటించనున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. 14రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు నిర్మించనున్నాయి.
బ్యాంక్ నుంచి భారీ అప్పులు తీసుకునే బిజినెస్‌మ్యాన్‌లు, వాళ్ల వల్ల నష్టపోయే సామాన్యులు అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇందులో బ్యాంక్ అధికారిగా క్లాస్ పాత్రలో, బ్యాక్ రుణాలను తప్పుడు దారిలో మంజూరి చేయించే మధ్యవర్తిగా మాస్ పాత్రలో కనిపిస్తారట మహేశ్. అమెరికాలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి తమన్ స్వరకర్త.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి