స్టేట్‌ రౌడీ | Mahesh Babu Next Movie With Vamsi Paidipally | Sakshi
Sakshi News home page

స్టేట్‌ రౌడీ

Dec 11 2020 5:32 AM | Updated on Dec 11 2020 5:32 AM

Mahesh Babu Next Movie With Vamsi Paidipally - Sakshi

మహేశ్‌ బాబు పక్కా మాస్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఎన్నో మాస్‌ పాత్రల్లో కనిపించారు. అయితే ఇప్పుడు చేయబోతున్నది మాస్‌ కా బాప్‌లా ఉంటుందట. ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ చిత్రంలో నటిస్తున్నారు మహేశ్‌. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. రాజమౌళి సినిమా ప్రారంభించేలోపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారట. ఈ సినిమాకి ‘స్టేట్‌ రౌడీ’ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు తెలిసింది. ఇందులో మహేశ్‌ పక్కా మాస్‌ రౌడీ పాత్రలో కనిపిస్తారట. ఇక ‘స్టేట్‌ రౌడీ’ అంటే.. గతంలో చిరంజీవి నటించిన ‘స్టేట్‌ రౌడీ గుర్తుకు రాకమానదు. 1989లో విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. మరి... మహేశ్‌కి ‘స్టేట్‌ రౌడీ’ టైటిలే షురూ అవుతుందా? వేచి చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement