మూడు రోజుల్లో ఆ వీడియోని తీసేయాలి!... సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్‌! | Sakshi
Sakshi News home page

Madhuban mein Radhika Song: సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్‌!

Published Sun, Dec 26 2021 6:34 PM

Madhuban mein Radhika Song: MP Minister Warns Sunny Leone - Sakshi

ఇటీవల కాలంలో కొన్ని పాటలు తమ మనోభావాలు దెబ్బతీసేలా తీస్తున్నారంటూ చాలామంది కేసులు వేసి కోర్టులకెక్కడం జరుగుతోంది. ఈ మధ్య సమంత ఐటెం సాంగ్‌ గురించి కూడా అటువంటి విమర్శలే వచ్చాయి. అచ్చం అదే రీతీలో సన్నీ లియోన్‌ నటించిన "మధుబన్ మే రాధికా నాచే" ఆల్బమ్‌పై విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఇప్పుడూ మధ్యప్రదేశ్ హోం మంత్రి సన్నీకి వార్నింగ్‌ ఇచ్చారు.

అసలు విషయంలోకెళ్లితే....ఇటీవల సన్నీ హాట్‌గా నటించిన "మధుబన్ మే రాధికా నాచే" వీడియో ఆల్బమ్‌ విడుదలైన దగ్గర నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా సన్నీ నటించిన ఆ మ్యూజిక్‌ ఆల్బమ్‌ని తీసేయడానికి 72 గంటలు సమయం ఇస్తున్నానంటూ  సన్నీని, గాయకుడు సాకిబ్ తోషిని హెచ్చరించారు. ఈ క్రమంలో హోం మంత్రి నరోత్తమ్ మాట్లాడుతూ... "ఆ ఆల్బమ్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. మేము రాధను పూజిస్తాం. సాకిబ్ తోషి తన మతానికి సంబంధించిన పాటలను ఈ విధంగా స్వరపరుచుకోవచ్చు కదా. ఇలాంటి పాటలు మమ్మల్ని బాధపెడతాయి.

మూడు రోజుల్లో ఆ వీడియో​ తీయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని హెచ్చరించారు. అంతేకాదు డిజైనర్‌ సబ్యసాచి పై చర్యలు తీసుకుంటాం అని అన్నారు. పైగా ఈ ఆల్బమ్‌ని నిషేధించాలంటూ హిందు పూజారులు కూడా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు యుపిలోని బృందావన్‌కు చెందిన సంత్ నావల్ గిరి మహారాజ్ కూడా ఈ వీడియోని ప్రభుత్వం నిషేధించకపోతే కోర్టుకు వెళ్తాం అంటూ హెచ్చరించారు. నిజానికి "మధుబన్ మే రాధికా నాచే" పాటను 1960లో కోహినూర్ చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడారు. అయితే ఈ పాట రాధ, కృష్ణుల ప్రేమకు సంబంధించినది.  అటువంటి పాటను సన్నీతో అశ్లీలంగా నృత్యం చేయించి తీయడంతోనే వివాదస్పదంగా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement