
Maa Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల ఫలితం అనంతరం మోహన్ బాబు పలు కీలక కామెంట్స్ చేశారు. 'నన్ను రెచ్చగొట్టాలని చాలా మంది చూశారు. సింహం నాలుగడుగులు వెనక్కి వేసిందంటే విజృంభిస్తుంది. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. కొందరు పలు వేదికలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నేను అసమర్థుడిని కాను..మౌనంగా ఉన్నా అంతే. నవ్వుతూ స్వీకరించాలి. సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రుల సహకారం లేకుండా ఏమీ చేయలేం' అని అన్నారు.