ఆప్యాయనురాగాలతో.. | Sakshi
Sakshi News home page

ఆప్యాయనురాగాలతో..

Published Mon, Sep 4 2023 12:55 AM

Ma Uri Sinma' is coming Maa Oori Sinma Movie Update - Sakshi

పులివెందుల మహేశ్, ప్రియా పాల్‌ జంటగా శివరామ్‌ తేజ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఊరి సిన్మా’.  జి. మంజునాథ్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రెస్‌మీట్‌లో పీపుల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్‌ కాసుల రామకష్ణ (శ్రీధర్‌), నటులు నాగమహేశ్, ‘బలగం’ సంజయ్‌ అతిథులుగా పాల్గొన్నారు.

‘‘ఇంత మంచి సినిమాను నిర్మించడానికి సహకరించినవారికి థ్యాంక్స్‌’’ అన్నారు జి. మంజునాథ రెడ్డి. ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది’’ అన్నారు శివరామ్‌ తేజ. ‘‘తండ్రీకొడుకుల అనురాగం, బావా–మరదళ్ల ఆప్యాయతతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు పులివెందుల మహేశ్‌.
 

Advertisement
 
Advertisement