Most Eligible Bachelor: ‘లెహరాయీ’ సాంగ్‌.. అఖిల్‌-పూజా కెమిస్ట్రీ అదిరింది!

Leharaayi Lyrical Song Out From Most Eligible Bachelor Movie - Sakshi

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి‘ అంటూ సాగే ఈ పాటకు శ్రీమణి లిరిక్స్‌ అందించగా, సిద్‌ శ్రీరామ్‌ తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు. ప్రేమగీతంగా రూపుదిద్దుకున్న ఈ పాటలో అఖిల్‌-పూజాల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమా అక్టోబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top