‘లంబసింగి’ మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

Lambasingi Review: ‘లంబసింగి’ మూవీ రివ్యూ

Published Fri, Mar 15 2024 3:51 PM

Lambasingi Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: లంబసింగి
నటీనటులు: భరత్ రాజ్, దివి, వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, నవీన్ రాజ్, ప్రమోద్, రమణ, పరమేష్ తదితరులు.
నిర్మాణ సంస్థ: కాన్సెప్ట్ ఫిలింస్
నిర్మాత: ఆనంద్.టి
సినిమాటోగ్రఫీ: కె.బుజ్జి
సంగీతం:ఆర్ఆర్.ధ్రువన్
విడుదల తేది: మార్చి 15, 2024

‘లంబసింగి'కథేంటంటే.. 
వీరబాబు(భరత్‌ రాజ్‌) కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. తొలి పోస్టింగ్‌ లంబసింగి అనే ఊరిలో పడుతుంది. అక్కడ నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఊర్లోకి వెళ్లిన తొలి రోజే హరిత(దివి)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్న నక్సలైట్‌ కోనప్ప కూతురు. కోనప్పతో పాటు చాలా మంది నక్సలైట్లు లొంగిపోయి అదే ఊరిలో  సాధారణ జీవితం గడుపుతుంటారు. పోలీసు శాఖే వారికి పునరావాసం కల్పిస్తుంది. హరిత  ఆ ఊరి ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ తండ్రికి తోడుగా ఉంటుంది. సంతకాల పేరుతో రోజు కోనప్ప ఇంటికి వెళ్తూ హరితను ఫాలో అవుతుంటాడు వీరబాబు. అలా వారిద్దరి మధ్య స్నేహం పెరుగుతుంది. ఓ రోజు వీరబాబు ప్రపోజ్‌ చేస్తే హరిత రిజెక్ట్‌ చేస్తుంది. అదే బాధలో ఉండగా.. పోలీసు స్టేషన్‌పై  నక్సలైట్లు దాడి చేస్తారు. ఆ దాడిలో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్‌ తగులుతుంది. అదేంటి? అసలు హరిత ఎవరు? వీరబాబు ప్రేమను ఎందుకు నిరాకరించింది? ఆమె కోసం వీరబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి? చివరకు హరిత ప్రేమను వీరబాబు పొందాడా లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

ఎలా ఉందంటే.. 
పోలీసు-నక్సలైట్ల పోరు నేపథ్యంలో జరిగే ఓ అందమైన ప్రేమ కథే ‘లంబసింగి’. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. కానీ తెరపై అంతే కొత్తగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ప్రారంభం స్లోగా అనిపిస్తుంది. హరిత, వీరబాబుల మధ్య పరిచయం పెరిగాక కథనంలో వేగం పుంజుకుంటుంది. 
 హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిఫరెంట్‌గా డిజైన్ చేశాడు ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచేలా చేశాడు.  ఇక ద్వితియార్థం  మాత్రం మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. క్లైమాక్స్‌ చాలా ఎమోషన్స్‌గా ఉంటుంది. బరువైన హృదయంతో ప్రేక్షకులు థియేటర్స్‌ నుంచి బయటకు వస్తారు.

ఎవరెలా చేశారంటే.. 
వీరబాబు పాత్రలో భరత్‌ చక్కగా నటించాడు. క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటాడు. అలాగే కామెడీతో అలరించాడు అని చెప్పాలి. హరిత అనే పాత్రలో దివి ఒదిగిపోయింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. తెరపై కొత్త దివిని చూస్తారు. క వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఆర్.ఆర్.ధృవన్ నేపథ్య సంగీతం..పాటలు సినిమాకు చాలా ప్లస్‌ అయింది. సినిమాలోని ప్రతి పాట ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:
Advertisement
Advertisement