కాసేపటి కోసం సమంతకు అన్ని లక్షలు ఇచ్చారట! | Kushi Meet In US: Samantha Ruth Prabhu Gets Paid Whopping Amount, Know Remuneration Details - Sakshi
Sakshi News home page

Samantha Remuneration For Kushi US Meet: అమెరికాలో ఖుషి ఈవెంట్‌.. టికెట్‌ ధర లక్షల్లో.. సామ్‌ ఎంత తీసుకుందో తెలుసా?

Aug 26 2023 7:23 AM | Updated on Aug 26 2023 9:01 AM

Kushi Meet In US: Samantha Gets Paid Whopping Amount - Sakshi

కేవలం కొద్దిసేపు మాత్రమే పాల్గొన్న ఆమెకు అక్షరాల రూ.30 లక్షలు చెల్లించినట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం లేదట. ఈవెంట్‌ నిర్వాహకులు టికెట్ల ధర రూ.12 వేల నుంచి రూ.2 లక్షల వరకు నిర్ణయించారు. రూ.2 లక్షల టికెట్‌ కొనుగోలు చేసినవారికి సమంత చేరువలో కూర్చునే సదా

ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా కాదు లెక్క. సమంత పక్కన కూర్చున్నామా, లేదా అన్నదే ముఖ్యం అంతే. సమంత నటిస్తేనే కాదు, కూర్చున్నా పారితోషికం చెల్లించి తీరాల్సిందే. ఏమిటీ పారితోషికం గొడవ అనుకుంటున్నారా? అయితే ఆ ముచ్చటేందో చదివేయండి..

మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న సమంత వైద్య చికిత్స కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిందంటూ మొదట ప్రచారం నడిచింది. కానీ ఆమె ఈ నెల 20న అక్కడ నిర్వహించిన 'ఇండియా డే పరేడ్' కార్యక్రమంలో పాల్గొంది. దీనికోసమే ఆమె అమెరికా వెళ్లింది. ఇకపోతే సమంత.. హీరో విజయ్‌ దేవరకొండతో జతకట్టిన ఖుషి చిత్రం సెప్టెంబర్‌ 1న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో విజయ్‌ సహా చిత్ర యూనిట్‌ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఆ మధ్య ఒకే ఒక్కసారి లైవ్‌ కన్సర్ట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయింది.

శుక్రవారం న్యూయార్క్‌లో ఖుషి ప్రచార కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. ఇందులో సమంత కూడా పాల్గొంది. కేవలం కొద్దిసేపు మాత్రమే పాల్గొన్న ఆమెకు అక్షరాల రూ.30 లక్షలు చెల్లించినట్లు సమాచారం. మరో విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం లేదట. ఈవెంట్‌ నిర్వాహకులు టికెట్ల ధర రూ.12 వేల నుంచి రూ.2 లక్షల వరకు నిర్ణయించారు. రూ.2 లక్షల టికెట్‌ కొనుగోలు చేసినవారికి సమంత చేరువలో కూర్చునే సదావకాశం ఉందట. దీంతో కొద్ది నిమిషాల్లోనే టికెట్లు హాట్‌కేకులా అమ్ముడుపోయాయట! అందుకే సమంత క్రేజ్‌ మామూలుగా లేదుగా అంటున్నారు నెటిజన్లు.

చదవండి: ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇస్తే దేశసమైక్యత దెబ్బతింటుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement