ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా, భైరవి అర్థ్యా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘కొత్త మలుపు’. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించారు.
సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. శివ వరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘గ్రామీణ నేపథ్యంలో ప్రేమ, రొమాన్స్, సస్పెన్స్, వినోదంతో రూపొందించిన చిత్రం ఇది’’ అని చెప్పారు. ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు తాటి బాలకృష్ణ. ఈ చిత్రానికి సహ నిర్మాత: తాటి భాస్కర్, సంగీతం: యశ్వంత్.


