అభిమానులకు భోజనం వడ్డించిన స్టార్‌ హీరో.. వీడియో వైరల్! | Kollywood Superstar Chiyaan Vikram Distributed Meals In Success Meet | Sakshi
Sakshi News home page

Vikram: స్వయంగా భోజనం వడ్డించిన తంగలాన్‌ హీరో.. వీడియో వైరల్!

Aug 28 2024 10:48 AM | Updated on Aug 28 2024 10:52 AM

Kollywood Superstar Chiyaan Vikram Distributed Meals In Success Meet

కోలీవుడ్ సూపర్ స్టార్‌ చియాన్ విక్రమ్ నటించిన పీరియాడికల్ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్‌ రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడంతో బాక్సాఫీస్ వద్ద బాగానే వసూళ్లు రాబట్టింది. పా రంజిత్ ‍డైరెక్షన్‌లో ఈ మూవీని స్టూడియో గ్రీన్‌ పతాకంపై నిర్మించారు.

భోజనం వడ్డించిన హీరో..

బాక్సాఫీస్ వద్ద తంగలాన్‌ సూపర్ హిట్‌ కావడంతో మేకర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా  చిత్రయూనిట్ సభ్యులు, అభిమానులతో కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన అభిమానులకు హీరో విక్రమ్ స్వయంగా భోజనం వడ్డించారు. స్టార్‌ హీరో అయి ఉండి సింపుల్‌గా కనిపించారు. తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో కనిపించి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement