The Kerala Story Box Office Collection, Refuses To Slow Down - Sakshi
Sakshi News home page

The Kerala Story: రూ.200 కోట్ల క్లబ్‌లో ది కేరళ స్టోరీ.. ఇది షాకేనన్న ఆర్జీవీ

Published Mon, May 22 2023 2:00 PM

The Kerala Story To Enter Rs 200 Cr Club, Refuses to Slow Down - Sakshi

ఈ మధ్య భారీ బడ్జెట్‌ సినిమాలు కనీస వసూళ్లు రాబట్టడానికి అపసోపాలు పడుతుంటే చిన్న సినిమాలు మాత్రం కేవలం మౌత్‌ టాక్‌తోనే భారీగా కలెక్షన్స్‌ రాబడుతూ రికార్డులు సృష్టిస్తున్నాయి. చిన్న సినిమాల పని అయిపోయిందనుకున్న సమయంలో బలమున్న కంటెంట్‌తో బరిలోకి దిగి బడా సినిమాలను సైతం వెనక్కు నెట్టి విజయాలు సాధిస్తున్నాయి. ఆ కోవలేకే వస్తుంది ది కేరళ స్టోరీ.

తీవ్ర వ్యతిరేకత మధ్య విడుదలైన ది కేరళ స్టోరీ మూవీ తొలి రోజు నుంచే దూసుకుపోతోంది. రికార్డుల దుమ్ము దులుపుతున్న ఈ సినిమా ఇప్పటిదాకా రూ.198 కోట్లు వసూలు చేసింది. నేడు వచ్చే కలెక్షన్స్‌తో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన రణ్‌బీర్‌ తు ఝూఠీ మై మక్కర్‌ సినిమా లాంగ్‌ రన్‌లో రెండు వందల కోట్లు సాధిస్తే కేరళ స్టోరీ మాత్రం కేవలం రెండున్నర వారాల్లోనే ఆ మార్క్‌ను దాటేస్తుండటం విశేషం. 

ఇక ఈ సినిమాపై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరోసారి ప్రశంసలు కురిపించాడు. 'మనకు అబద్ధాలు అలవాటైపోయాయి. అలాంటిది ఎవరైనా నిజం చెప్తున్నారంటే, ఆ నిజాన్ని వెలికి తీసి చూపిస్తుంటే షాకవుతాం. కేరళ స్టోరీ విజయం బాలీవుడ్‌ను చావుదెబ్బ కొట్టింది' అని ట్వీట్‌ చేశాడు. కాగా ది కేరళ స్టోరీ సినిమాలో హీరోయిన్‌ అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించగా విపుల్‌ షా నిర్మాతగా వ్యవహరించాడు.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే!
గ్రాండ్‌గా నిర్మాత డీవీవీ దానయ్య తనయుడి వివాహం

Advertisement
 
Advertisement
 
Advertisement