‘కార్తికేయ2’ టీమ్‌కి అరుదైన గౌరవం

Karthikeya 2 Team Gets Special Invitation From ISKCON - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్‌, విలక్షణ దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కార్తికేయ2’ చిత్రానికి తాజాగా అరుదైన ఆహ్వానం లభించింది. ఈ చిత్ర యూనిట్‌కి ఇస్కాన్ అత్యున్నత సంస్థానం బృందావన్‌కు రావాలని ఆహ్వానం అందింది. కార్తికేయ 2 చిత్రం  శ్రీ కృష్ణుడి తత్వం, ఆయన బోధించిన ఫిలాసఫీ ఆధారంగా వస్తుందని.. టీజర్, మోషన్ పోస్టర్‌ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రాందాస్ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఇస్కాన్ మెయిన్ సంస్థానం నుంచి ఆహ్వానం అందడం పట్ల చిత్రయూనిట్‌ హర్షం వ్యక్తం చేస్తోంది. 

 ఇప్పటి వరకు ఇతిహాసాల నేపథ్యంలో, మైథలాజికల్ స్టోరీస్‌ నేపథ్యంలో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి. భారతం, భాగవతం, రామాయణాలపై సినిమాలతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సీరియల్స్ రూపొందాయి. అయితే భారతీయ సినీ చరిత్రలో ఎవరికీ దక్కని గౌరవం కార్తికేయ 2 టీంను వరించడం గమనార్హం.పిపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top