‘వంటలక్క’ వెరైటీ ఫొటో.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Karthika Deepam Premi As Allu Arjun Pose - Sakshi

‘‘సిత్తరాల సిరపడు సిత్తరాల సిరపడు..’’ అంటూ అల వైకుంఠపురములో మూవీలో మాస్​ బీట్​తో బంటు అలియాస్​ అల్లు అర్జున్​ స్టైలిష్ ఫైట్​తో అలరించాడు కదా. సేమ్​.. ఆ రేంజ్​ ఫోజుతో వంటలక్క అలియాస్​ నటి ప్రేమి విశ్వనాథ్​ సోషల్ మీడియాలో ఫ్యాన్స్​ను అలరిస్తోంది. 

సీరియల్​తోనే కాదు.. ఛాన్స్​ దొరికితే బయట కూడా తన చేష్టలతో ఫ్యాన్స్​ను ఎంటర్​టైన్​ చేస్తుంటుంది ప్రేమి విశ్వనాథ్​. లుంగీ కట్టు, పూల చొక్కా, చేతిలో సిగరెట్, నోటి నుంచి గుప్పుమని పొగ, గాల్లో ఎగిరే కోడిపుంజు.. వెరసి ప్రేమి ఆరాచకమైన ఫొజుతో అలరిస్తోంది.  తన సోదరుడు తీసిన ఆ ఫొటోను ఇన్​స్ట్రాగ్రామ్​లో షేర్​ చేసుకోవడంతో పాటు అల్లు అర్జున్​ హ్యాష్​ట్యాగ్​ను యాడ్​ చేసింది మన వంటలక్క. ఫాలోవర్స్​ కోసం.. కింద నో స్మోకింగ్ అంటూ క్యాప్షన్​ కూడా ఉంచింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top