 
													కన్నడ సెన్సేషన్ కాంతార సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, ప్రశంసలతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు రిషబ్ శెట్టి.

అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించి ఓ వార్త కన్నడ నాట చర్చనీయాంశంగా మారింది. రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడంటూ తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ జర్నలిస్ట్ ట్వీట్ చేయడంతో కాసేపటికే అది వైరల్‌గా మారింది.

అయితే తాజాగా ఈ విషయంపై రిషబ్ శెట్టి స్పందించారు. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. ఈ ప్రచారంలో నిజం లేదు. నా సినిమాలకు మద్దతివ్వండి చాలు అంటూ అభిమానులు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. గతంలోనూ తన పొలిటికల్ ఎంట్రీపై వార్తలు వచ్చాయని, అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపై ఉందని చెప్పుకొచ్చారు.
 
  
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
