తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ సక్సెస్‌ టూర్‌, ప్రేక్షకులను కలవనున్న రిషబ్‌ శెట్టి | Kantara Movie Team Visits Tirupati and Visakhapatnam Over Success Tour | Sakshi
Sakshi News home page

Kantara Movie Success Tour: తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ సక్సెస్‌ టూర్‌, ప్రేక్షకులను కలవనున్న రిషబ్‌ శెట్టి

Published Fri, Oct 28 2022 2:42 PM | Last Updated on Fri, Oct 28 2022 2:44 PM

Kantara Movie Team Visits Tirupati and Visakhapatnam Over Success Tour - Sakshi

కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కొల్లగొడుతోంది. దేశవ్యాప్తంగా కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. కన్నడలో సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ అయిన ఈ చిత్రం తెలుగులో అక్టోబర్‌ 15న రిలీజ్‌ అయ్యి ఇక్కడ కూడా బ్లాక్‌బస్టర్‌ అందుకుంది.

మెగా నిర్మాత అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌ బ్యానర్లో ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్‌ చేశారు. తెలుగులో మూవీ విజయవంతంగా ఆడుతున్న నేపథ్యంలో ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు కాంతార మూవీ టీం సక్సెస్‌ టూర్‌ను నిర్వహించనుంది. అక్టోబర్‌ 29న(శనివారం) తిరుపతి, వైజాగ్‌లో ప్రదర్శించబుడుతున్న థియేటర్స్‌ను సందర్శించనున్నారు. ఈ సక్సెస్‌ టూర్‌లో చిత్ర దర్శకుడు, హీరో రిషబ్‌ శెట్టి పాల్గొననున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement