
25 ఏళ్ల సౌజన్య మరణ వార్త విని ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు
Soujanya Kannada Actress Death: చిత్రసీమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ టీవీ సీరియల్ నటి సౌజన్య(25) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నటి సౌజన్య బెంగుళూరులోని కుంబల్‌గోడులో తన అపార్ట్‌మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె రూమ్‌లో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. అందులో తన ఆత్మహత్యకు తానే మాత్రమే కారణమని పేర్కొంది. ఆమె తన తల్లిదండ్రుల నుంచి క్షమాపణ కూడా కోరారు.
తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ, తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలతో మానసికంగా బాధపడుతున్నాని నోట్‌లో పేర్కొంది. సౌజన్య కొన్ని టెలివిజన్ సీరియల్స్‌తోపాటు పలు సినిమాలలో కూడా నటించారు. 25 ఏళ్ల సౌజన్య మరణ వార్త విని ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు. సౌజన్య మృతిపట్ల పలువురు టీవీ, సినీ నటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.