ఆటో డ్రైవర్‌తో గొడవ..డబ్బులివ్వకుండా బెదిరింపులు.. నటిని తిట్టిపోస్తున్న జనాలు

Kannada Television Actress Padmini Quarreled with Auto Driver - Sakshi

కన్నడ బుల్లితెర నటి పద్మిని ఆటో డ్రైవర్‌తో గొడవపడింది. అతడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఆటో మధ్యలో ఆపి వెళ్లిపోయింది. దీంతో డ్రైవర్‌.. నటి తనను మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నటి పద్మిని మల్లేశ్వరంలోని మార్గోసా రోడ్‌ నుంచి బాణశంకరికి ఆటో బుక్‌ చేసింది. దీనికిగానూ ఆమె రూ.437 చెల్లించాల్సి ఉంటుందని ఉబర్‌‌ యాప్‌లో చూపించింది. ఆమె డ్రైవ్‌ను ఓకే చేసిన కుల్‌దీప్‌ అనే వ్యక్తి తనను ఆటోలో పికప్‌ చేసుకున్నాడు. మార్గమధ్యంలో వీరి ఆటో కొంత ట్రాఫిక్‌లో చిక్కుకుంది. దీంతో పద్మిని ఆటో డ్రైవర్‌ మీద అరిచింది.

అసలు ఈ రోడ్‌లో నుంచి ఎందుకు తీసుకొచ్చావ్‌? ఇక్కడ ఇంత ట్రాఫిక్‌ ఉంది.. నువ్వు సరిగా ఆటో నడపట్లేదు అని తిట్టిపోసింది. ట్రాఫిక్‌ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను అని డ్రైవర్‌ చెప్తున్నా వినిపించుకోలేదు. మార్గమధ్యంలోనే ఆటో దిగిపోయింది. అతడికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టింది. డబ్బులివ్వమని అడిగితే ఇవ్వనని తెగేసి చెప్పింది. ఎక్కువ మాట్లాడితే ఉబర్‌కు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. చివరకు అన్నంతపని చేయడంతో ఉబర్‌ యాజమాన్యం అతడిని తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది.

అయితే ఆటో డ్రైవర్‌ నటి గొడవను తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు. తను ఏ తప్పూ చేయకున్నా నటి గొడవపడిందని, డబ్బులివ్వకపోవడమే కాకుండా తనపైనే ఫిర్యాదు చేసిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా.. నటి పద్ధతి అస్సలు బాగోలేదని విమర్శిస్తున్నారు. నాలుగు వందల రూపాయలు ఇవ్వడానికి కూడా ఇంత కక్కుర్తా? అలాంటప్పుడు ఆటో బుక్‌ చేసుకోవడం దేనికని విమర్శిస్తున్నారు.

చదవండి: అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి.. దానివల్ల భయంగా ఉందంటూ..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top