అందరు చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్‌!

Kanna Master Kiss To Monal Gajjar In Dance Plus Show - Sakshi

బిగ్‌ బాస్‌ 4 ఫేం మోనాల్‌ గజ్జర్‌ ఒకప్పుడు ఎవరికి తెలియదు. హీరోయిన్‌గా ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్కసారిగా బిగ్‌బాస్‌ షోతో వచ్చేసింది. ఫేడ్‌ అవుట్‌ అయిన హీరోయిన్‌గా బిగ్‌ బాస్‌ హౌజ్‌లో అడుగుపెట్టిన ఈ గుజరాతి భామ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. దీనికి అభిజిత్‌, అఖిల్‌ సార్థక్‌తో ఒకేసారి లవ్‌ ట్రాక్‌ నడపడమే. అలా 98 రోజుల పాటు హౌజ్‌లో కొనసాగిన మోనాల్‌పై విమర్శలు వచ్చినప్పటికి బయటకు వచ్చాకా ఆమెకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.

అంతేగాక దర్శక నిర్మాతల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు  వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకు పలు సినిమాల్లో నటించే అవకాశం కొట్టెసింది. దీంతో పాటు స్టార్‌ మాలో వస్తున్న డ్యాన్స్‌ ప్లస్‌ రియాలిటీ షోకు మెంటర్‌గా చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా స్టేజ్‌పై కాలు కదుపుతోంది ఈ భామ. ఈ క్రమంలో నిన్న స్టార్‌ మా విడుదల చేసిన ప్రోమో ప్రస్తుతం నెట్టంట వైరల్‌ అవుతోంది. ఈ షోలో కన్నా మాస్టర్ టీమ్ రెండు వారాల క్రితం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మోనాల్‌ మెప్పు పొందిన సంగతి తెలిసిందే. ఈ టీం పర్ఫామెన్స్‌కు ఫిదా అయిన మోనాల్‌ కన్నా మాస్టర్‌ను తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టింది. అలా తీసుకెళ్తోన్న సమయంలో ఓ రొమాంటిక్ సాంగ్ వేశారు షో నిర్వహకులు.

ఆ తర్వాత కన్నా మాట్లాడుతూ మేడమ్ కోసం ఏదైనా చేస్తానని చెప్పడంతో తనకు ఇష్టమైన పట్టు వస్త్రాలు కూడా వేసుకువస్తావా అని ఓంకార్‌ అడగ్గా.. మేడమ్‌ చేప్తే తప్పకుండా వేసుకోస్తానంటూ సమాధానం ఇచ్చాడు. అన్నట్టుగానే ఈ వారం జరిగే ఎపిసోడ్‌కు కన్నా మాస్టర్‌ పట్టు వస్రాలతో దర్శనమిచ్చాడు. తన పర్ఫామెన్స్‌ తర్వాత మోనాల్‌ను స్టేజ్‌పైకి తీసుకువేళ్లి తనతో స్టేప్పులేశాడు. అనంతరం ఆమెకు గులాబి పువ్వు ఇచ్చి మోకాళ్లపై కుర్చోని మోనాల్‌ చేయిపై ముద్దు పెట్టాడు. అది చూసి కంటెస్టెంట్స్‌, షో మెంటర్స్‌తో పాటు యాంకర్‌ ఓంకార్‌ సైతం ఒక్కసారిగా షాకయ్యారు.

చదవండి: మోనాల్‌తో వీడియో కాల్‌, అఖిల్‌ కామెంట్ వైరల్‌‌‌
మహేశ్‌తో స్పెషల్‌ సాంగ్‌: మోనాల్‌ క్లారిటీ!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top