ఎన్నిక‌ల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్‌ | Sakshi
Sakshi News home page

ఎన్నిక‌ల ప్రచారం ఎంత కష్టమో తెలిసింది: కంగనా రనౌత్‌

Published Sat, May 18 2024 7:52 PM

Kangana Ranaut Comments On Election Campaign

లోక్‌సభ ఎన్నికల బరిలో హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నుంచి బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. వాస్తవంగా బీజేపీలో చేరకముందే ఆమె టికెట్‌ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఏడో దశ ఎన్నికల్లో భాగంగా మండిలో జూన్‌ 1న పోలింగ్‌ జరగనుంది. ఆమెకు పోటీగా కాంగ్రెస్‌ నుంచి విక్రమాదిత్యసింగ్‌ బరిలో నిలిచారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల రణరంగంలోకి దిగిన తర్వాత ఎంత కష్టమో తనకు తెలిసిందని ఆమె చెప్పింది. ఎన్నికల ప్రచారం కోసం తను పడుతున్న కష్టం ముందు సినిమా కష్టాలు చాలా చిన్నవని కంగనా పేర్కొంది.

 Kangana Ranaut Lok Sabha Election 2024 Campaigning

ఎన్నికల యుద్ధం ప్రారంభం నుంచి వరుసగా  ప్రజా సభలతో పాటు పార్టీ కార్యకర్తలతో అనేక సమావేశాలు నిర్వహించినట్లు ఆమె అన్నారు. ఈ క్రమంలో పర్వత ప్రాంతాల్లో చాలా కష్టమైన రహదారులపై ఒక్క రోజే 450 కిలోమీటర్ల మేరకు ప్రయాణం చేసినట్లు కంగనా తెలిపారు. ఎన్నికల ప్రచారం వల్ల సరిగ్గా నిద్రకు కూడా సమయం దొరకడం లేదని ఆమె చెప్పారు. కనీసం సమయానికి భోజనం కూడా తీసుకోవడంలేదని అన్నారు. 

ఇవన్నీ చూసిన తర్వాత ఈ పోరాటం ముందు సినిమా నిర్మించడానికి పడే కష్టాలు ఓ జోక్ లాంటివేనని కంగన చెప్పడం విశేషం. కంగనా రనౌత్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'. జూన్ 14న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వాయిదా వేసిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
 
Advertisement