సంగీత ప్రియులను అలరిస్తున్న కమల్‌ హాసన్‌కు సభ్యత్వం | Kamal Haasan Get Membership In Music Artists Association | Sakshi
Sakshi News home page

Kamal Haasan: సంగీతంలో లోకనాయకుడికి సభ్యత్వం

Jul 15 2021 8:01 AM | Updated on Jul 15 2021 8:01 AM

Kamal Haasan Get Membership In Music Artists Association - Sakshi

బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్‌ హాసన్‌కు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆయన 46 ఏళ్ల సినీ పయనంలో ఎన్నో జనరంజకమైన పాటలను ఆలపిస్తూ సంగీత ప్రియులను అలరిస్తున్నారు. అలాంటి కమల్‌ హాసన్‌కు సినీ సంగీత కళాకారుల సంఘం గౌరవ సభ్యత్వాన్ని అందించింది.

ఈ సంఘం అధ్యక్షుడు దీనా మంగళవారం స్థానిక ఆల్వార్‌ పేటలోని కమల్‌ కార్యాలయానికి వెళ్లి ఆయనకు సినీ సంగీత కళాకారుల సంఘంలో గౌరవ సభ్యత్వానికి సంబంధించిన గుర్తింపుకార్డును అందజేశారు. ఈ సందర్భంగా దీనాతో పాటు సినీ సంగీత కళాకారుల సంఘం కార్యదర్శి జోనా భగత్‌కుమార్‌ ఎస్‌.డి, ఆ సంఘం ట్రస్ట్‌ చైర్మన్‌ ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌ కమల్‌హాసన్‌ కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement