ఎన్‌ రూట్‌ హారర్‌ రూట్‌! | Kajal Aggarwal to team up with Director Kalyan | Sakshi
Sakshi News home page

ఎన్‌ రూట్‌ హారర్‌ రూట్‌!

Dec 6 2020 5:26 AM | Updated on Dec 6 2020 5:26 AM

Kajal Aggarwal to team up with Director Kalyan - Sakshi

పెళ్లయిన తర్వాత హీరోయిన్లకు సినిమాల్లో వేగం తగ్గుతుంది అంటారు. అవకాశాలు తగ్గుతాయంటారు. అయితే ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పెళ్లికి ముందులానే పెళ్లయ్యాక కూడా బిజీగా ఉంటున్నారు నాయికలు. అందుకు తాజా ఉదాహరణ కాజల్‌ అగర్వాల్‌. పెళ్లి తర్వాత డీకే దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్‌ హారర్‌ చిత్రం అంగీకరించారు కాజల్‌. ఇది తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం. తాజాగా తమిళంలో రెండో సినిమా అంగీకరించారు.

‘గోస్టీ’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం కూడా హారర్‌ జానరే. ఇలా వరుసగా హారర్‌ చిత్రాలు ఒప్పుకుంటూ ‘ఎన్‌ రూట్‌ హారర్‌ రూట్‌’ (నా రూట్‌ హారర్‌ రూట్‌) అని కాజల్‌ అంటున్నారని అనుకోవచ్చు. కల్యాణ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘గోస్టీ’లో హారర్‌ ఎంత ఉంటుందో వినోదం కూడా అంతే ఉంటుందని తెలిసింది. ఎందుకంటే ఈ సినిమాలో సుమారు 25మంది కమెడియన్లు నటించనున్నారు. అలాగే ఓ ప్రముఖ హీరో కూడా అతిథి పాత్రలో కనిపిస్తారట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుంది. ప్రస్తుతం కాజల్‌ చేతిలో చిరంజీవి ‘ఆచార్య’, కమల్‌హాసన్‌ ‘భారతీయుడు 2’, దుల్కర్‌ సల్మాన్‌ ‘సినామిక’ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement