తహశీల్దార్‌ కార్యాలయంలో ఎన్టీఆర్‌.. ఫోటోలు వైరల్‌

Jr NTR Spotted In Shanka Palli MRO Office, Pics Goes Viral - Sakshi

Jr NTR: రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లిలోని తహశీల్దార్‌ కార్యాలయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సందడి చేశారు. గోపాలపురం గ్రామంలోని రెవెన్యూ పరిధిలోని ఆరున్నర ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించి రిజిస్ర్టేషన్‌ పనుల కోసం ఎన్టీఆర్‌ స్వయంగా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లినట్లు సమాచారం. ఈ సందర్భంగా తహశీల్దార్‌ కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఎన్టీఆర్‌తో​ ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తారక్‌తో సెల్ఫీలు దిగి ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఎన్టీఆర్‌ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్‌తో పాటు రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంలో  ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఇక సినిమాలతో బిజీగా ఉంటూనే ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యారు తారక్‌. త్వరలోనే ఈ ప్రోగ్రాం టెలికాస్ట్‌ కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top