‌భారీ పారితోషికం.. నాగార్జున కంటే ఎక్కువే

JR  NTR Receiving Huge Remuneration For Evaru Meelo Koteeswarudu show - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌  హోస్ట్‌గా చేయబోతున్న రియాల్టీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’. త్వరలోనే జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో ప్రోమో ఇది వరకే విడుదల అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించ‌డంతో మంచి స‌క్సెస్ అయింది. ఇక నాగార్జున, చిరంజీవి హోస్ట్‌లుగా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాల్టీ షో ఎంత ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. మొదటి మూడు సీజన్లకి కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా, 2017లో వచ్చిన నాలుగో సీజన్‌కి మాత్రం మెగాస్టార్‌ చిరంజీవి హోస్ట్‌గా చేశాడు.


ఇప్పుడు అదే షోని కొన్ని మార్పులతో ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెమ్యునరేషన్‌ ఎంత అనే విషయంలో సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తోంది. గతంలో మూడు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జునకు దాదాపుగా 4.5 కోట్ల రూపాయల పారితోషికం ఇవ్వగా, చిరంజీవి సుమారు రూ.9 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హోస్ట్‌గా చేయబోతున్న ఎన్టీఆర్‌ కోసం షో నిర్వాహకులు రూ.7.5 కోట్లను పారితోషికంగా ఇవ్వనున్నట్లు టాక్‌ వినిపోస్తోంది.


గతంలో బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా నిర్వహించిన ఎన్టీఆర్‌ నాలుగు కోట్ల రూపాయలను రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం  'ఎవరు మీలో కోటీశ్వరులు' రియాలిటీ షో కోసం దాన్ని అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది. 60 ఎపిసోడ్‌లుగా ఈ సీజన్ ను ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఈ ప్రోగ్రాం ఏప్రిల్‌ చివరిలో లేదా మే తొలి వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరోవైపు తమ హీరోను బుల్లితెరపై కనులారా చూసుకునేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

చదవండి :  (పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్)‌‌
(ఆర్‌ఆర్‌ఆర్‌: సీత వచ్చేసిందిగా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top