ఆర్‌ఆర్‌ఆర్‌: రామరాజు కోసం నిరీక్షిస్తున్న సీత

Alia Bhatt Sita Look RRR New Poster Released - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం)లో ఇప్పటివరకు యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ లుక్స్‌ను రిలీజ్‌ చేశారు. కానీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌ లుక్‌ను మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో ఆలియా ఆకుపచ్చని చీరలో ఎవరికోసమో ఎదురు చూసి అలిసి బుంగమూతి పెట్టుకుని కనిపిస్తున్నట్లు ఉంది. ఆమె అంతలా నిరీక్షిస్తుంది రామరాజు కోసం అంటే రామ్‌చరణ్‌ కోసమే! ఇక ఆమె బర్త్‌డేను పురస్కరించుకుని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ఆలియాకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతోంది.

కాగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చెర్రీతో ఆలియా భట్‌ జోడీ కడుతుండగా తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటించనున్నారు. ఏప్రిల్‌లో రామ్‌చరణ్‌–ఆలియా భట్‌పై రెండు పాటలు చిత్రీకరించేందుకు రాజమౌళి ప్రణాళిక సిద్ధం చేశారట. వాటిలో ఒకటి రొమాంటిక్‌ సాంగ్‌ కాగా దీన్ని ఆలియా స్వయంగా పాడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె పాడనున్నది హిందీ వెర్షన్‌కి సంబంధించిన పాట అని తెలుస్తోంది. పాన్‌ ఇండియాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 13న రిలీజ్‌ అవుతోంది.

చదవండి: రణ్‌బీర్‌కి కరోనా... క్వారంటైన్‌లో ఆలియా!

జొమాటో వివాదం: గుండె తరుక్కుపోతోంది..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top