List Of Actresses Who Rejected RRR Movie, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న హీరోయిన్స్‌..

Mar 30 2022 3:26 PM | Updated on Mar 30 2022 4:03 PM

Heroines Who Rejected SS Rajamouli RRR Movie And Here Is The Reason - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 500కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టిందీ చిత్రం. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ల నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమలో ఆలియా భట్‌, బ్రిటిష్‌ నటి ఒలివియా మోరిస్‌ హీరోయిన్లుగా నటించారు. అయితే వీరికంటే ముందే చాలా మంది హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి. 

కానీ కొన్ని కారణాల వల్ల వారు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటించేందుకు రిజెక్ట్‌ చేశారట. దీంతో జక్కన్న సినిమాలో ఛాన్స్‌ వదులుకున్న ఆ ఆ హీరోయిన్స్‌ ఎవరా అని నెటిజన్లు చర్చిస్తున్నారు. సీత పాత్ర కోసం ఆలియా కంటే ముందుగా శ్రద్దా కపూర్‌ని అప్రోచ్‌ అయ్యారట. కానీ ఆమె బిజీ షెడ్యూల్స్‌ వల్ల ఈ ఆఫర్‌ని తిరస్కరించిందట. ఆ తర్వాత పరిణితి చోప్రాను అడగ్గా ఆమె కూడా డేట్స్‌ అడ్జస్ట్‌ చేసుకోలేక ఈ సినిమాను వదులుకుంది.

ఇక ఎన్టీఆర్‌కి జోడీగా ఒలివియా కంటే ముందు అమీ జాక్సన్‌ని సంప్రదించారట. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె కూడా నో చెప్పిందట. దీంతో బ్రిటన్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్‌ అనే నటిని తీసుకున్నా కొద్ది రోజులకే ఆమె ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్‌ ఒలివియా మోరిస్‌కు దక్కిందనమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement