జొమాటో వివాదం: గుండె తరుక్కుపోతోంది..

Parineeti Chopra Appeals To Zomato To Find truth Supports Delivery Man - Sakshi

సాక్షి, బెంగళూరు: ఫుడ్‌ క్యాన్సిల్‌ చేసినందుకు జొమాటో డెలివరీ బాయ్‌ తనపై పిడిగుద్దులు కురిపించాడంటూ బెంగళూరు మహిళ హితేషా చంద్రానీ తీసిన ఓ వీడియో విపరీతంగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ మహిళే తనను తిట్టి, చెప్పులతో కొట్టి అవమానించిందని సదరు డెలివరీ బాయ్‌ కామరాజ్‌ మీడియాకు తెలిపాడు. కాస్త ఆలస్యంగా వెళ్లినందుకు ఆర్డర్‌ తీసుకుని డబ్బులివ్వకుండా నెట్టివేసిందని ఈ క్రమంలోనే ఆమె చేతి వేలికి ఉన్న ఉంగరం ముక్కుకు తగిలి రక్తం కారిందని డెలివరీ బాయ్‌ పేర్కొన్నాడు.

ఆమెపై తను చేయి చేసుకోలేదని, అన్యాయంగా తనను కేసులో ఇరికించారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో కొందరు మహిళకు సపోర్ట్‌ చేస్తుండగా మరికొందరు మాత్రం డెలివరీ బాయ్‌ మాటల్లో నిజమున్నట్లు కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా కూడా ఈ వివాదంపై స్పందించింది. దయచేసి ఈ విషయంలో నిజానిజాలేంటో నిగ్గు తేల్చి ప్రజలముందుంచండని జొమాటో యాజమాన్యాన్ని కోరింది.

"ఒకవేళ అతడు అమాయకుడైతే(నేనైతే అతడు ఏ పాపం ఎరుగడనే నమ్ముతున్నా) ఆ యువతిని శిక్షించండి. ఈ ఘటన నిజంగా అమానవీయం, సిగ్గుచేటు, గుండె తరుక్కుపోతోంది. దయచేసి ఈ విషయంలో నేనేమైనా సాయం చేయగలనేమో చెప్పండి" అని అభ్యర్థిస్తూ ట్వీట్‌ చేసింది. కాగా ఈ వివాదంలో డెలివరీ బాయ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేయగా గురువారం బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. అతడు గత 26 నెలలుగా జొమాటోలో పని చేస్తున్నాడు. తను అందించిన సేవలకు గానూ 4.75/5 రేటింగ్‌ పొందాడు. మరి ఈ గొడవలో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు? అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి సోషల్‌ మీడియాలోనూ #JusticeForKamraj హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. 

చదవండి: జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అరెస్ట్‌ 

‘ఆ గాయం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.. ఆ​మే స్వయంగా’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top