జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ అరెస్ట్‌ 

Zomato Delivery Man Assaults Bengaluru Model, Arrested - Sakshi

సాక్షి, బెంగళూరు : ఫుడ్‌ డెలివరీ ఆలస్యం కావడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేసిన మహిళా కస్టమర్‌పై దాడి చేసిన జొమాటో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ కామరాజ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్‌చేశారు. మంగళవారం మధ్యాహ్నం హితేశా చంద్రాణి అనే మహిళ జొమాటో యాప్‌ ద్వారా భోజనం ఆర్డర్‌ చేశారు. నిర్ధేశిత సమయం దాటి సాయంత్రం 4.30 అయినా భోజనం ఇంకా డెలివరీ కాకపోవడంతో ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేశారు. ఇంతలో ఫుడ్‌ డెలివరీ బాయ్‌ కామరాజ్‌.. ఆ డెలివరీతో ఇంటికొచ్చాడు.

ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేశానని కామరాజ్‌తో చంద్రాణి చెప్పారు. అయినా వినకుండా ఇంట్లోకి చొరబడి కామరాజ్‌ ఫుడ్‌ పార్శిల్‌ను పెట్టడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. చివరకు చంద్రాణిని కామరాజ్‌ కొట్టడంతో ఆమె ముక్కుపై గాయాలయ్యాయి. దాడి విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు.  విషయం తెల్సుకున్న పోలీసులు కామరాజ్‌ను అరెస్ట్‌చేశారు. చంద్రాణికి తమ తరఫున క్షమాపణ చెబుతున్నామని, ఆమెకు వైద్య చికిత్స సాయం అందిస్తామని ఫుడ్‌ డెలివరీ యాప్‌ ‘జొమాటో’ ట్వీట్‌ చేసింది.

చదవండి: (యువతిపై జొమాటో బాయ్‌ పిడిగుద్దులు: వైరల్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top