అజిత్‌తో అతిథిగా! | John Abraham to make his Tamil debut with Ajith Valimai | Sakshi
Sakshi News home page

అజిత్‌తో అతిథిగా!

Jan 12 2021 5:58 AM | Updated on Jan 12 2021 5:58 AM

John Abraham to make his Tamil debut with Ajith Valimai - Sakshi

తమిళ స్టార్‌ అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ‘వలిమై’. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హెచ్‌. వినోద్‌ దర్శకుడు. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ కథానాయిక. ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహాం అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్‌. ఈ సినిమాలో రేసర్‌ పాత్రలో జాన్‌ కనిపిస్తారట. బైక్స్, బేక్‌ రేసింగ్‌ అంటే జాన్‌ అబ్రహాంకి ఆసక్తి అనే విషయం గుర్తుండే ఉంటుంది. ఇది జాన్‌ అబ్రహాంకి తొలి తమిళ సినిమా అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement