'వేదా'గా వచ్చేస్తున్న జాన్‌ అబ్రహాం | Sakshi
Sakshi News home page

'వేదా'గా వచ్చేస్తున్న జాన్‌ అబ్రహాం

Published Fri, Feb 9 2024 12:26 AM

John Abraham and Sharvari Wagh starrer Vedaa release date announced - Sakshi

బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహాం నటించిన తాజా యాక్షన్‌ మూవీ ‘వేదా’. ‘సలామ్‌ ఏ ఇష్క్‌’ (2007) వంటి హిట్‌ మూవీ తర్వాత హీరో జాన్‌ అబ్రహాం, డైరెక్టర్‌ నిఖిల్‌ అద్వానీ కాంబినేషన్‌లో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రంలో శార్వరీ వాఘ్‌ హీరోయిన్‌గా నటించారు. మోనీషా అద్వానీ, మధు భోజ్వాని, జాన్‌ అబ్రహాం నిర్మించారు. పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్‌.

ఈ సందర్భంగా జాన్‌ అబ్రహాం, శార్వరీ వాఘ్‌ల ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘యాక్షన్‌ డ్రామాగా ‘వేదా’ రూపొందింది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ చిత్రం తీశాను. ఈ మూవీ మన సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబిస్తుంది’’ అని నిఖిల్‌ అద్వానీ పేర్కొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement