డిఫరెంట్‌ గెటప్స్ ట్రై చేసేది అందుకే: జాతిరత్నాలు భామ

Jathi Ratnalu Heroine Faria Abdullah Loved Hyderabad Online Store Design - Sakshi

చిట్టి.. నా బుల్‌బుల్‌ చిట్టి.. అంటూ కుర్రకారు మనసు దోచుకున్న నటి, సొగసైన పొడగరి ఫరియా అబ్దుల్లా.. మొదటి సినిమాతో ఇటు గ్లామర్‌ పరంగా అటు నటనాపరంగా వందశాతం మార్కులు కొట్టేసింది. ఆరేళ్ల వయసులోనే యాక్టర్‌ కావాలనుకుందట ఈ అమ్మడు. అందుకే డిఫరెంట్‌ డిఫరెంట్‌ గెటప్స్, డ్రెస్‌లు ట్రై చేస్తుంటానని చెప్పింది చిట్టి. ఆ నటికి నచ్చిన.. ఆమె మెచ్చిన బ్రాండ్స్‌ ఇవీ.. 

గీతిక కానుమిల్లి.. 
హైదరాబాద్‌కు చెందిన గీతిక కానుమిల్లి.. చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాషన్‌ డిజైనర్‌ కావాలని కలలు కంది. ఆ ఆసక్తితోనే ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు పూర్తి చేసింది. అనంతరం 2018లో హైదరాబాద్‌లో  ‘గీతిక కానుమిల్లి’ అని తన పేరుమీదే ఓ బొటిక్‌ ప్రారంభించింది. అనతి కాలంలోనే ఆమె డిజైన్స్‌ పాపులర్‌ అయి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. పి.వి.సింధు, సమంత, కీర్తి సురేష్, సైనా నెహ్వాల్‌ వంటి చాలా మంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్‌ చేసింది. ధర కూడా డిజైన్‌ను బట్టే ఉంటుంది. ఇక్కడ ఏది కొనాలన్నా వేల నుంచి లక్షల్లో ఖర్చు చేయాలి. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌ అన్నిటిలోనూ ఈ డిజైన్స్‌ లభిస్తాయి.

ద ట్రింక్‌ హాలిక్‌..
ఇదొక ఇన్‌స్టాగ్రామ్‌ షాపింగ్‌ సైట్‌. ఈ మధ్యనే మొదలైన ఈ బ్రాండ్‌ .. అతి తక్కువ ధరలకే అందమైన జ్యూయెలరీని అందిస్తోంది. క్వాలిటీకి పెట్టింది పేరు. అదే వీరి బ్రాండ్‌ వాల్యూ. అందుకే, సామాన్య ప్రజల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఇది ఫేవరెట్‌. ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌ మెయిన్‌ ప్లాట్‌ఫామ్‌గా వీటిని కొనుగోలు చేయొచ్చు. వాట్సాప్‌ చేసి కూడా ఆర్డర్‌ చేయొచ్చు. 

చదవండి: క్లాస్ అయినా.. మాస్‌ అయినా ఆయనే ‘బాస్‌’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top