త్వరలో ఆ అవకాశం ఉంది: జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor Speech at Mili Movie Press Meet | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: త్వరలో ఆ అవకాశం ఉంది

Nov 3 2022 4:15 AM | Updated on Nov 3 2022 10:11 AM

Janhvi Kapoor Speech at Mili Movie Press Meet - Sakshi

‘‘దక్షిణాది ప్రేక్షకులు మా అమ్మకి  (శ్రీదేవి), నాన్నకి (బోనీ కపూర్‌) ఎంత ప్రేమను ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేను సౌత్‌లో సినిమా చేయాలనుకుంటున్నాను.. త్వరలోనే చేసే అవకాశం ఉంది’’ అని జాన్వీ కపూర్‌ అన్నారు. మాతుకుట్టి గ్జేవియర్‌ దర్శకత్వంలో జాన్వీ కపూర్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’. బోనీ కపూర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలకానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో జాన్వీ కపూర్‌ మాట్లాడుతూ– ‘‘గ్జేవియర్‌గారు ఈ కథ చెప్పి నప్పుడు నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. మా నాన్నగారితో నేను చేసిన తొలి సినిమా ఇది.. ఈ చిత్రం చూసి ఆయన చాలా ఎగ్జయిట్‌ అయ్యారు. మైనస్‌ 18 డిగ్రీల టెంపరేచర్‌లో నటించడం అనేది ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అన్నారు. బోనీ కపూర్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగులో నా సతీమణి శ్రీదేవికి లభించి నట్లుగానే నా కుమార్తె జాన్వీకి కూడా అదే తరహా ప్రేమాభిమానాలు దక్కుతాయని ఆశిస్తున్నాను’’ అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement