‘ఐపీఎల్‌’ పెద్ద హిట్‌ కొట్టాలి | IPL Movie To Release On 10th February | Sakshi
Sakshi News home page

‘ఐపీఎల్‌’ పెద్ద హిట్‌ కొట్టాలి

Feb 7 2023 10:36 AM | Updated on Feb 7 2023 10:36 AM

IPL Movie To Release On 10th February - Sakshi

విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్‌ హీరో హీరోయిన్లుగా సురేష్‌ లంకలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐపీఎల్‌’. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్‌ బ్యానర్‌పై బీరం శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో నిర్మాత బెక్కం వేణుగోపాల్‌ మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలు హిట్‌ అయినప్పుడు సంతోషంగా ఉంటుంది. ‘ఐపీఎల్‌’ మూవీ కూడా పెద్ద హిట్‌ కావాలి’’ అన్నారు.

‘‘క్రికెట్, తీవ్రవాదం నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. సినిమా బాగా వచ్చింది.. అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సురేష్‌ లంకలపల్లి. ‘‘మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌’’ అన్నారు బీరం శ్రీనివాస్‌. ‘‘ఈ సినిమాలో పాటలు హిట్‌ కావడానికి కారణం మ్యూజిక్‌ డైరెక్టర్‌ వేంగి సుధాకర్‌’’ అన్నారు విశ్వ కార్తికేయ.

Advertisement
 
Advertisement
Advertisement