
పద్నాలుగు భాషలు.. పది నిమిషాల డైలాగ్! సంభాషణలను అలవోకగా చెప్పగల నటుల్లో కమల్‌హాసన్ ముందు వరుసలో ఉంటారు. పాత్రకు తగ్గట్టు నటనలో, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడం, సంభాషణలు పలకడంలో కమల్ సూపర్. ఇప్పడు 65ఏళ్లకు పైబడిన వయసులోనూ కమల్ ఒకప్పటిలా సుదీర్ఘ సంభాషణలు చెప్పడం విశేషం. ఇటీవల ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) కోసం కమల్ పది నిమిషాల డైలాగ్ చెప్పారట.
సింగిల్ టేక్‌లో కమల్ ఈ డైలాగ్ చెప్పడం, అది కూడా పద్నాలుగు భాషలు ఉన్న డైలాగ్ కావడంతో యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారని కోలీవుడ్ టాక్. ఈ హై ఓల్టేజ్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందట. గతంలో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా రూపొందిన ‘ఇండియన్’ (1996)కి సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత ఈ చిత్రం షూటింగ్‌ని ఇటీవలే ఆరంభించారు.