అమ్మానాన్నలని డబ్బులు అడగలేను: నటి

I Too Have Financial Issues : Shruti Haasan - Sakshi

కమల్‌హాసన్‌ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్‌ ఆ తర్వాత తన నటనతో అవకాశాలను సంపాదించుకుంటుంది. టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శృతి.. తనకూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ‘ఈ కరోనా ఎప్పుడు అయిపోతుందా అని చూస్తూ ఇంట్లో కూర్చోలేను, లాక్‌డౌన్‌ ముగిసిన వెంటనే నేను షూటింగ్‌లో పాల్గొనాలి. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో మాస్క్‌ లేకుండా షూటింగ్‌ చేయడం చాలా కష్టమే అయినప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల పని చేయక తప్పదు. అందుకే షూటింగ్స్‌ ప్రారంభించిన వెంటనే సెట్స్‌లోకి వెళ్లిపోతా.

గత 11ఏళ్లుగా నా ఖర్చులకి నేను సంపాదించుకుంటున్నా. నేను ఒక ఇండిపెండెంట్‌ మహిళను. నా బిల్లులు చెల్లించుకోవడానికి అమ్మానాన్నలను డబ్బులు అడగలేను. నా కాళ్ల మీద నిల‌బ‌డ‌టానికే నేను ప్ర‌య‌త్నిస్తాను. అందుకే పనిచేసి తీరాలి. నా పర్సనల్‌ లైఫ్‌, కెరీర్‌కు సంబంధించి నేనే నిర్ణయాలు తీసుకుంటా. ఇక కరోనా వల్ల చాలామంది ఖరీదైన కార్లు, ఇళ్లు కొనుక్కోలేదని చెబుతుంటారు. కానీ నేను మాత్రం ఓ ఇల్లు కొనుకున్నా. ఇండిపెండెంట్‌గా ఎదగడం నాకెంతో గర్వంగా ఉంది. నా వెనుక దేవుడు ఉన్నాడని బలంగా నమ్ముతాను’ అని పేర్కొంది. అయితే సడెన్‌గా శృతి ఈ కామెంట్స్‌ ఎందుకు చేసిందా అంటూ నెటిజన్లు సందేహాంలో పడ్డారు. ప్రస్తుతం ఆమె తెలుగులో ప్రభాస్‌ సరసన సలార్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: 
TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్‌ బాబు ఆర్థిక సహాయం

కమల్‌ ఓటమిపై శృతి హాసన్‌ ఎమోషనల్‌ రియాక‌్షన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top