హైదరాబాద్‌ వరదలు : ప్రభాస్‌ భారీ విరాళం

Hyderabad Rains: Prabhas Donates RS 1 Crore To Telangana CM Relief Fund - Sakshi

సాక్షి, హైద‌రాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరబాద్‌ నగరం అతలాకుతలం అయింది. పలు కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలను అందిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే  మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చెరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. (చదవండి : భారీ వరదలు: టాలీవుడ్‌ స్టార్స్‌ విరాళాలు)

వీరితో పాటు అక్కినేని నాగార్జున రూ.50 లక్షలు, జూనియర్‌ ఎన్‌టీఆర్‌ రూ.50 లక్షలు, విజయ్‌ దేవరకొండ రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణలో వరద నష్టానికి సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` షూటింగ్ నిమిత్తం ఇటలీలో ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‍ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌తో ఆదిపురుష్‌, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ చిత్ర చేయనున్నాడు. [ చదవండి : అత్యవసరంగా డబ్బులు కావాలా? అయితే ఇలా చేయండి ]

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top