మూడు భాగాల హనీ ట్రాప్‌

Honey Trap Telugu Movie Launch - Sakshi

సాయిరుషి, తేజ అనుపోజు హీరో, హీరోయిన్లుగా శివకార్తీక్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హనీట్రాప్‌’.  పి. సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వంలో వీవీ వామనరావు నిర్మాతగా వ్యవహరించటంతో పాటు ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ప్లేను అందించి, నటిస్తున్నారు. సునీల్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రముఖ రంగస్థల నాటక రచయిత, మిత్రుడు వామనరావు మంచి కథ వినిపించారు. క్లాసిక్‌ టచ్‌ ఉన్న కథాంశం కావటంతో ‘ఓ రొమాంటిక్‌ క్రైమ్‌కథ’ చిత్రంలానే ఈ చిత్రాన్ని కూడా మూడు సిరీస్‌లుగా రూపొందించాలనుకుంటున్నాను. సంక్రాంతికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘అందరినీ ఆలోచింపజేసే సినిమా అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు వామనరావు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ ఇమ్మడి, సాహిత్యం: యక్కలి రవీంద్రబాబు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top