First Look: HM Srinandan Says About Lie Lovers Movie - Sakshi
Sakshi News home page

Lie Lovers Movie: తెలుగువాడినే కానీ మొదట్లో కన్నడలో సినిమాలు చేశా

Feb 9 2022 9:29 AM | Updated on Feb 9 2022 10:33 AM

HM Srinandan About Lie Lovers Movie - Sakshi

 ‘‘నేను తెలుగువాణ్ణే అయినా తొలుత కన్నడలో సినిమాలు చేశాను. కొత్త ఫార్మాట్‌లో, డిఫరెంట్‌గా ఈ సినిమా చేశా. నా గత చిత్రాలను చూసిన నిర్మాతలు కథ వినకుండానే

రవిశంకర్, ఇర్ఫాన్, జెడీ ఆకాష్, సెహర్‌ అప్సర్, సుమితా బజాజ్‌ ప్రధాన పాత్రల్లో హెచ్‌ఎం శ్రీనందన్‌ దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా(తెలుగు, కన్నడ) చిత్రం ‘లై లవర్స్‌’. కన్నడంలో ‘బీగ’ టైటిల్‌ ఖరారు చేశారు. రమేష్‌ రెడ్డి, చెక్కల నాగేశ్వర్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని దర్శకుడు ఏఎస్‌ రవికుమార్, టీజర్‌ను దర్శకులు సునీల్‌కుమార్‌ రెడ్డి, వీరభద్రం విడుదల చేశారు.

హెచ్‌.ఎం శ్రీనందన్‌ మాట్లా డుతూ–  ‘‘నేను తెలుగువాణ్ణే అయినా తొలుత కన్నడలో సినిమాలు చేశాను. కొత్త ఫార్మాట్‌లో, డిఫరెంట్‌గా ఈ సినిమా చేశా. నా గత చిత్రాలను చూసిన నిర్మాతలు కథ వినకుండానే ‘లై లవర్స్‌’ నిర్మించారు’’ అన్నారు. ‘‘సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు నిర్మాతలు. దర్శకుడు సాగర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement