'హిట్‌' సిరీస్‌లో వెంకటేశ్‌? త్వరలోనే సెట్స్‌పైకి మూవీ | Sakshi
Sakshi News home page

'హిట్‌' సిరీస్‌లో వెంకటేశ్‌? త్వరలోనే సెట్స్‌పైకి మూవీ

Published Tue, Dec 27 2022 4:23 AM

HIT Movie Director Sailesh Kolanu To Team Up With Venkatesh - Sakshi

హిట్‌ ఫ్రాంచైజీలో వచ్చిన ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’, ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’ చిత్రాలు హిట్స్‌గా నిలిచాయి. దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కిస్తున్న ఈ హిట్‌ సిరీస్‌ థర్డ్‌ పార్ట్‌ ‘హిట్‌: ది థర్డ్‌ కేసు’ చిత్రంలో నాని హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో పోలీసాఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌ పాత్రలో నటిస్తారు నాని. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.

అయితే హిట్‌ ఫ్రాంచైజీలో ఓ హీరోగా వెంకటేశ్‌ నటించనున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. వెంకటేశ్‌కు శైలేష్‌ కొలను ఇటీవల ఓ కథ వినిపించారనే వార్తలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కథ ‘హిట్‌’ సిరీస్‌లోనిదే అని సమాచారం. ‘హిట్‌ 2’ ఎండింగ్‌లో నాని వచ్చి, ‘హిట్‌ 3’లో హీరోగా నటిస్తున్నారు. అలా ‘హిట్‌ 3’ ఎండింగ్‌లో వచ్చి, ‘హిట్‌ 4’లో హీరోగా నటిస్తారట వెంకటేశ్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement