Heroines Got Injured While Doing Powerful Roles - Sakshi
Sakshi News home page

గాయం...  ఓ మంచి బహుమతి

Published Wed, Mar 1 2023 12:59 AM

heroins got injured while doing powerful roles - Sakshi

గాయం తియ్యగా ఉంటుందా... మనసు తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది. కొందరు కథానాయికలు కొన్ని గాయాలను అలానే తీసుకున్నారు. పవర్‌ఫుల్‌ రోల్స్‌ చేసేటప్పుడు అయిన గాయాలను  ‘బహుమతి’గా, ‘తియ్యని గాయం’లా అనుకుంటున్నారు. ‘ఆగేదే లేదు’ అంటూ దూసుకెళుతున్నారు. ఆ నాయికల గురించి తెలుసుకుందాం.

యాక్షన్‌కి దక్కిన బహుమతి 
ఒకవైపు మయోసైటిస్‌ వ్యాధితో పోరాటం చేసి, దాదాపు కోలుకున్న సమంత మరోవైపు ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌లో పో రాట సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్న సమంత హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ యానిక్‌ బెన్‌ దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత షూట్‌లో పా ల్గొన్నారు.

అయితే యాక్షన్‌ సీన్‌ తీస్తున్నప్పుడు ఆమె రెండు చేతులకు గాయాలయ్యాయి. మంగళవారం ఆ ఫోటోను షేర్‌ చేసి, ‘యాక్షన్‌కి దక్కిన బహుమతి ఇది’ అని పేర్కొన్నారు సమంత. ప్రియాంకా  చోప్రా  ఓ లీడ్‌ రోల్‌లో రూసో బ్రదర్స్‌ తెరకెక్కించిన హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’కి ఇండియన్‌ వెర్షన్‌గా వరుణ్‌ ధావన్, సమంత లీడ్‌ రోల్స్‌లో రాజ్‌ అండ్‌ డీకే ఈ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. 

నొప్పిని మరచి... 
గాయం చిన్నదైనా పెద్దదైనా నొప్పి మాత్రం కామన్‌. అయితే త్రిష మాత్రం గాయం తాలూకు నొప్పి తెలియలేదు అంటున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన పొ న్నియిన్‌ సెల్వన్‌’ షూట్‌లో తగిలిన గాయాల గురించే త్రిష ఈ విధంగా అన్నారు. విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితరులు ప్రధాన తారాగణంగా రెండు భాగాలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం పొ న్నియిన్‌ సెల్వన్‌’. తొలి భాగం గత ఏడాది సెప్టెంబర్‌ 30న విడుదల కాగా మలి భాగం ఏప్రిల్‌ 28న రిలీజ్‌ కానుంది.

ఇందులో యువరాణి కుందవై పా త్ర చేశారు త్రిష. పో రాట సన్నివేశాల్లో నటించినప్పుడు తన చేతులకు గాయాలయ్యాయని, శోభిత (పొ న్నియిన్‌...’లో ఓ కీలక పా త్రధారి) చెవులకు కూడా గాయం అయిందని త్రిష పేర్కొన్నారు. అయితే గాయాల తాలూకు నొప్పిని మరచిపో యి షాట్‌ గ్యాప్‌లో కబుర్లు చెప్పుకుని, ఆ తర్వాత షూటింగ్‌లో పా ల్గొనేవాళ్లమని త్రిష పేర్కొన్నారు. అలాగే పొ న్నియిన్‌ సెల్వన్‌’ తన జీవితంలో ఓ మంచి జ్ఞాపకం అని కూడా అన్నారామె.

తియ్యని గాయం 
‘క్రికెట్‌ చూడ్డానికి ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది కానీ ఆడేటప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో’ అంటున్నారు జాన్వీ కపూర్‌. రాజ్‌కుమార్‌ రావ్, జాన్వీ కపూర్‌ క్రికెటర్లుగా కనిపించనున్న చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’. ఈ సినిమాలోని పా త్ర కోసం టీమిండియా క్రికెటర్‌ దినేష్‌ కార్తీక్‌ వద్ద శిక్షణ తీసుకున్నారు జాన్వీ. ఇటీవల తన పా త్రకు సంబంధించిన షూట్‌ని పూర్తి చేశారీ బ్యూటీ. ఈ సందర్భంగా ఈ సినిమా తనకు ఎప్పటికీ మరచిపో లేని అనుభూతిని మిగిల్చిందని పేర్కొన్నారామె.

‘‘ఈ సినిమా కోసం కెమెరా ముందు క్రికెట్‌ ఆడినప్పుడు రెండు సార్లు నా భుజానికి గాయం అయింది. ఎముక పొషన్‌ మారింది. అయినప్పటికీ తియ్యని గాయం అనుకుంటున్నాను. ఒంటరిగా కూర్చుని నేను చేసిన సినిమాల గురించి ఆలోచించుకున్నప్పుడు కచ్చితంగా ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ ముందు గుర్తొస్తుంది. ఇది నాకు అపురూపమైన సినిమా’’ అన్నారు జాన్వీ. శరణ్‌ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. 

గాయంతోనే షూటింగ్‌ 
వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది వాక్సిన్‌ వార్‌’. ఈ చిత్రంలో కీలక పా త్ర చేస్తూ, ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు పల్లవీ జోషి. ఆ మధ్య ఈ చిత్రం చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌ శివార్లలో వేసిన సెట్‌లో జరిగింది. ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా వాహనం అదుపు తప్పడంతో పల్లవీ జోషికి స్వల్ప గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆ సన్నివేశం పూర్తి చేశాకే ఆమె డాక్టర్‌ దగ్గరికి వెళ్లారు.   ఈ నాయికలే కాదు.. ఆ మధ్య టబు, శిల్పా శెట్టి వంటి తారలు కూడా షూటింగ్స్‌లో గాయపడ్డారు.                  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement