యాక్షన్‌ మోడ్‌లో యంగ్‌ హీరో.. అతడి కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో | Harish Kalyan, Athulya Ravi Diesel Movie Wrapped | Sakshi
Sakshi News home page

Harish Kalyan: యాక్షన్‌ హీరోగా మారిన లవర్‌ బాయ్‌.. షూటింగ్‌ పూర్తి!

Nov 14 2023 5:13 PM | Updated on Nov 14 2023 6:16 PM

Harish Kalyan, Athulya Ravi Diesel Movie Wrapped - Sakshi

హరీష్‌ కళ్యాణ్‌ ఇంతకుముందు నటించిన చిత్రాలన్నింటి కంటే భారీ బడ్జెట్‌లో రూపొందిస్తున్న చిత్రమని నిర్మాత తెలిపారు. ఇందులోని బీర్‌ అనే పల్లవితో సాగే పాట సంగీత

హీరో హరీష్‌ కళ్యాణ్‌ కోలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటిది డీజిల్‌ చిత్రంతో యాక్షన్‌ హీరోగా అవతారం ఎత్తుతున్నాడు. థర్డ్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్‌  పతాకంపై ఎం దేవరాజులు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి షణ్ముగం ముత్తుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. నటి అతుల్య రవి హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో సాయికుమార్, కరుణాస్, వినయ్‌ రాయ్, అనన్య, జాకీర్‌ హుస్సేన్, సచిన్‌ ఖడేకర్, మారిముత్తు, సురేఖ వాణి, వివేక్‌ ప్రసన్న, కాళీ వెంకట్, సుభద్ర, దీన, తంగదురై, లక్ష్మీ శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

దిబు నిమన్‌ థామస్‌ సంగీతాన్ని, రిచర్డ్‌ ఎం.నాధన్‌ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ దీపావళి సందర్భంగా వెల్లడించింది. డీజిల్‌ మూవీలో యాక్షన్‌ సందేశాలతో పాటు ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ 75 కు పైగా లొకేషన్లలో వంద రోజుల్లో నిర్వహించి పూర్తి చేసినట్లు దర్శకుడు తెలిపారు.

ఇది హరీష్‌ కళ్యాణ్‌ ఇంతకుముందు నటించిన చిత్రాలన్నింటి కంటే భారీ బడ్జెట్‌లో రూపొందిస్తున్న చిత్రమని నిర్మాత తెలిపారు. ఇందులోని బీర్‌ అనే పల్లవితో సాగే పాట సంగీత ప్రియులను విశేషంగా ఆలరిస్తుందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే డీజిల్‌ చిత్ర ట్రైలర్, ఆడియో, టీజర్‌ విడుదల గురించి అధికారికంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.

చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్‌ హీరోయిన్‌.. 13 ఏళ్లుగా వెండితెరకు దూరం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement