ఒకే సెట్‌లో సల్మాన్‌, చిరంజీవి

Godfather Chiranjeevi to fly to Mumbai for Salman Khan - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఒకే స్టూడియోలోకి అడుగుపెట్టనున్నారు. డైరెక్టర్‌ స్టార్ట్‌ అనగానే గెట్‌.. సెట్‌.. షూట్‌ అంటూ నటించడానికి రెడీ అవుతున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో సల్మాన్‌ ఓ కీలక పాత్ర చేయనున్న విషయం తెలిసిందే. మోహన్‌ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ శనివారం ముంబయ్‌లో ఆరంభం కానుందని టాక్‌.

కజ్రత్‌లోని ఎన్‌డీ స్టూడియోలో జరగనున్న ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, సల్మాన్‌ పాల్గొనగా కొన్ని యాక్షన్‌ సీన్స్‌తో పాటు ఎమోషన్‌ సీన్స్‌ కూడా చిత్రీకరించనున్నారని టాక్‌. దాదాపు వారం పాటు ఈ షెడ్యూల్‌ జరుగుతుందట. రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమా మలయాళ ‘లూసిఫర్‌’కి  రీమేక్‌. ఇందులో నయనతార కీలక పాత్ర చేస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top