నందు యాక్టింగ్‌పై భార్య గీతా మాధురి కౌంటర్!‌‌‌ | Geetha Madhuri Funny Comment On Nandu Acting On Social Media | Sakshi
Sakshi News home page

నందు యాక్టింగ్‌పై భార్య గీతా మాధురి కౌంటర్!

Apr 24 2021 5:25 PM | Updated on Apr 24 2021 8:12 PM

Geetha Madhuri Funny Comment On Nandu Acting On Social Media - Sakshi

టాలీవుడ్ సింగర్ గీతా మాధురి, ఆమె భర్త హీరో నందు సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. సోషల్‌ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌పై నందు స్పందిస్తూ తనదైన శైలిలో వేసే సటైర్లకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అలాగే మీమ్స్, థంబ్ నెయిల్స్ మీద నందు వేసే సెటైర్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో నందుకు ఫాలోయింగ్‌ కూడా పెరిగిపోయింది. అదే విధంగా తన భార్య గీతా మాధురి, తనపై వచ్చే మీమ్స్, ట్రోల్స్‌ను ఎంతో స్పోర్టీవ్‌గా తీసుకునే అతడు ఇటీవల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

‘సవారి’ సినిమాతో నందు హీరోగా హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో తన సినిమాపై నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్‌, చేయడం, తన స్టార్డం మీద సెటైర్లు వేయడంతో అతడు ఫైర్ అయ్యాడు. కాగా ప్రస్తుతం ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే మూవీలో నటిస్తు‍న్నాడు. అయితే మీమర్స్‌ను ఎంకరేజ్ చేసేందుకు నందు తన మీద, తన చిత్రం మీద వెరైటీ మీమ్స్ వేసిన వారికి ఇటీవల ఓ స్పెషల్ గిఫ్ట్సను కూడా ఆఫర్‌ చేశాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన భార్య గీతాపై వచ్చిన ఓ మీమ్‌పై స్పందించాడు. ‘మీరు ఒక వేళ నటి అయ్యుంటే మా పరిస్థితి ఏంటి’అని తెలుగు హీరోయిన్స్ అనుకుంటున్నట్టుగా గీతాను ఉద్దేశిస్తూ ఓ మీమ్ ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఆ మీమ్‌ కాస్తా నందు దృష్టికి వచ్చింది. అది చూసిన నందు ‘మరి కలిసి ఒక స్క్రిప్ట్ చేద్దామా’ అంటూ ఫన్నిగా కౌంటర్ వేశాడు. ఇక నందు కామెంట్‌పై గీతా స్పందిస్తూ.. ‘అబ్బో నువ్వు చాలా చేశావ్‌గా.. నాకు అంత లేదు నీకు తెలుసుగా?’ అంటూ భర్త కామెంట్‌కు కౌంటర్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ జంట కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగా గీతా మాధురి బిగ్ బాస్ రెండో సీజన్‌లో రన్నర్‌గా నిలిచి అందరిని మనసులను గెలుచుకున్న సంగతి తెలిసిందే. నందు కూడా బిగ్ బాస్ ఇంట్లోకి రాబోతోన్నాడనే వార్తలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అయితే బీబీ అంటూ తన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’  మూవీని బిగ్ బాస్ పేరిట ప్రమోట్ చేసుకుని అందరి ద‌ృష్టిలో పడ్డాడు.

చదవండి: 
అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది: ఇలియానా
‘అసలు ఈ ఏడాది బిగ్‌బాస్‌ ఉందా లేదా?!’

Advertisement
 
Advertisement
Advertisement