Gautham Karthik-Manjima Mohan: అవును మేము ప్రేమలో ఉన్నాం!

Gautham Karthik confirms relationship with Manjima Mohan - Sakshi

చిత్ర పరిశ్రమకు చెందిన హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కొత్తేమీ కాదు. అలా తాజాగా కోలీవుడ్, మాలీవుడ్‌కు చెందిన మరో జంట ప్రేమలో పడ్డారు. ఆ జంటలో హీరో గౌతమ్‌ కార్తీక్‌. సీనియర్‌ నటుడు కార్తీక్‌ వారసుడు ఈయన. మణిరత్నం దర్శకత్వం వహించిన కడల్‌ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయిన గౌతమ్‌ కార్తీక్‌ ఆ తరువాత వరుసగా చిత్రాలు చేస్తున్నారు.

ఇకపోతే నటి మంజిమా మోహన్‌ గురించి చెప్పాలంటే మలయాళం చిత్రం ప్రేమమ్‌ ద్వారా పరిచయం అయిన ముగ్గురు హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అచ్చం యన్‌బదు మడమయడ చిత్రం ద్వారా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ ఈ అమ్మడిని కోలీవుడ్‌కు దిగుమతి చేశారు. ఆ చిత్రం హిట్‌తో ఇక్కడ అవకాశాలను అందుకుంటున్నారు. అలా గౌతమ్‌ కార్తీక్, మంజిమా మోహన్‌ కలిసి దేవరాట్టం చిత్రంలో నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమ గురించి ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది.

అయితే ఆ వార్తలపై నటుడు గౌతమ్‌ కార్తీక్‌ గానీ, నటి మంజిమా మోహన్‌ స్పందించలేదు. అలాంటిది ఇన్నాళ్లకు నటుడు కార్తీక్‌ తమ ప్రేమ గురించి బ్లో అప్‌ అయ్యారు. అవును మేము ప్రేమించుకున్నాం అని ఇన్‌ స్ట్రాగామ్‌ లో మంజిమామోహన్‌ కలిసున్న ఫొటోను పోస్ట్‌ చేశారు. అయితే పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అన్నది వెల్లడించలేదు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top