సూపర్‌ చాన్స్‌ కొట్టేసిన ఈషా రెబ్బా

Eesha Rebba Play Key Role In Shakuntalam - Sakshi

గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. పౌరాణిక కథతో రూపొందనున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఈషా రెబ్బా ఓ కీలక పాత్ర చేయనున్నారని తెలిసింది. సమంత స్నేహితురాలి పాత్రను ఈషా చేయనున్నారని ఫిలింనగర్‌ టాక్‌. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్‌ వర్క్‌ జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో గుణశేఖర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top