
ED Files Contempt Of Court Petition Against Telangana CS Excise Director: టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వట్లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. సీఎస్ సోమేష్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరిన వివరాలను ఈడీకి ఇవ్వాలని ఫిబ్రవరి 2న ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
తర్వాత మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించిన నిందితులు, సాక్షుల డిజిటల్ డేటా ఇవ్వాలని ఫిబ్రవరి 8న ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. హైకోర్టు ఆదేశించినా డ్రగ్స్ కేసు డిజిటల్ డేటా ఇవ్వడం లేదని బుధవారం (మార్చి 23) ఈడీ పిటిషన్ వేసింది. వివరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతోందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తుంది. సోమేష్ కుమార్, సర్ఫరాజ్‌కు న్యాయవాది ద్వారా ఈనెల 13న నోటీసు ఇచ్చామని ఈడీ పేర్కొంది.