సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో 

Dr Minakshi mishra tweeted shocking video - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై తాజాగా ఒక షాకింగ్ వీడియో అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా సుశాంత్ మరణానికి కారణం ఆత్మహత్య కాదు హత్య అని చెబుతున్న ఒక వీడియోను షేర్ చేశారు. దీనిపై తన వాదనలకు మద్దతుగా ఈ వీడియోలో వివరించారు. ముఖ్యంగా సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి వివరించారు. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. దీంతో సుశాంత్ ఆత్మహత్యపై ఇప్పటికే వ్యక్తమవుతున్నఅనుమానాలకు తోడు తాజా వీడియో ద్వారా మరింత బలం చేకూరుతోందన్న వాదన వినిపిస్తోంది. (‘సుశాంత్‌ హత్యకు గురయ్యారు’)

మరోవైపు సుశాంత్ ది ఆత్మహత్యకాదు కచ్చితంగా హత్యే అంటూ సంచలనం రేపిన మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామి ఈ ట్వీట్ ను రీట్వీట్ చేయడం గమనార్హం.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.   (సుశాంత్ కేసు : మరో వివాదం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top