Do You Know How Much Dowry Aadhi Pinisetty Asks Nikki Galrani - Sakshi
Sakshi News home page

Aadhi Pinisetty: హీరో ఆది పినిశెట్టి ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా?

Jun 4 2022 9:33 PM | Updated on Jun 5 2022 11:29 AM

Do You Know How Much Dowry Aadhi Pinisetty Asks Nikki Galrani - Sakshi

ఎంత లవ్‌ మ్యారేజ్‌ అయితే మాత్రం కట్నం తీసుకోకుండా ఎందుకుంటాడు? భారీగానే అందుకుని ఉంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లను

యువ కథానాయకుడు ఆది పినిశెట్టి ఇటీవలే ఓ ఇంటివాడైన విషయం తెలిసిందే! మే 18న తాను ప్రేమించిన హీరోయిన్‌ నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. రెండు రోజుల క్రితమే ఆది దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ఎంత కట్నం తీసుకున్నాడంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎంత లవ్‌ మ్యారేజ్‌ అయితే మాత్రం కట్నం తీసుకోకుండా ఎందుకుంటాడు? భారీగానే అందుకుని ఉంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లను ఆయన సన్నిహితులు తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ఆది కట్నకానులకు బద్ధ వ్యతిరేకి అని, పెళ్లికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారట. ఆది ఎంత అడిగితే అంత ఇవ్వడానికి నిక్కీ కుటుంబం రెడీగా ఉన్నా అతడు మాత్రం పైసా కూడా వద్దని సున్నితింగా తిరస్కరించాడట. ఆది మంచి మనసుకు అతడి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.

కాగా ఆది, నిక్కీలది ప్రేమ వివాహం. 2015లో వచ్చిన యాగవరైనమ్‌ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్‌ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు మే 18న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్‌' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు.

చదవండి 👇
నేనూ సాయిపల్లవి ఫ్యానే, జూన్‌ 5న రెడీగా ఉండండి: రానా
మేజర్‌ గుండెల్ని పిండేసే సినిమా: అల్లు అర్జున్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement