
హాస్యనటుడు గిల్‌బర్ట్ గాట్‌ఫ్రెడ్(67) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణించిన విషయాన్ని అతడి కుటుంబసభ్యులు మంగళవారం ధృవీకరించారు. కాగా బ్రూక్లిన్‌లో జన్మించిన గాట్‌ఫ్రెడ్ న్యూయార్క్‌లో పెరిగారు.
హాస్యనటుడు గిల్‌బర్ట్ గాట్‌ఫ్రెడ్(67) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణించిన విషయాన్ని అతడి కుటుంబసభ్యులు మంగళవారం ధృవీకరించారు. ఆయన మరణం మాకు తీరని లోటు అంటూ పలువురు హాలీవుడ్ ప్రముఖులు గాట్‌ఫ్రెడ్‌కు నివాళులు అర్పిస్తున్నారు. కాగా బ్రూక్లిన్‌లో జన్మించిన గాట్‌ఫ్రెడ్ న్యూయార్క్‌లో పెరిగారు. దేని గురించైనా కామెడీ చేసే తత్వం ఆయన్ను కమెడియన్‌గా నిలబెట్టింది. గాట్‌ఫ్రెడ్ అన్ని అంశాల మీద కూడా కామెడీ చేసేవారు.
2001లో న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో దాడులు జరిగి సుమారు మూడు వేల మంది చనిపోగా దాని మీద కూడా చమత్కారాలు పేల్చారు. సునామీ, భూకంపాలు, వాటివల్ల జరిగే ప్రాణనష్టంపై కూడా జోక్స్ చేసేవారు. ఇదిలా ఉంటే గాట్‌ఫ్రెడ్.. యానిమేటెడ్ ఫిలిం అల్లా వుద్దీన్‌లో చిలుక పాత్రకు వాయిస్ అందించారు.
చదవండి: రెండేళ్లు సహజీవనం..బ్రేకప్..20 ఏళ్లకు మళ్లీ పెళ్లి!